చలం ఆత్మ కథ నుండి. 10 వ అధ్యాయం. పేజి నెం. 60.
మద్రాసు వీధుల వెంట ఇద్దరమూ తిరుగుతున్నాం. ఆ జూన్ నెల లో సూర్యుడు మండిపోతున్నాడు. ఇప్పుడు నాకు ఉద్యోగమైంది కనుక నా జేబులో కొన్ని డబ్బులున్నాయి. కానీ జెట్కాలెక్కి తిరిగేటన్ని లేవు. అప్పుడు మద్రాసులొ తప్ప, తెలుగుదేశంలో ఎక్కడా ఆడవాళ్ళ hostels లేవు. ఏ school అన్నా వొయ్యిని చేర్చుకుని చౌకగా ఉంచుకునే hostel కనబడుతుందేమో అని వెదుకుతూ తిరుగుతున్నాం. ధరలూ, మర్యాదలూ, విద్యల కొలతలూ ఏమీ తెలియని వాళ్ళం. మా దుమ్ము కొట్టిన మొహాలు, పాత బట్టలు చూస్తేనే మా మీద ఎవరికీ నమ్మకం రావడం లేదు. మా దేభ్య మొహాలు చూసి ఒక క్రిస్టియన్ ఆయన,"Can I be of any help? అన్నాడు.అదేమి అద్రుష్టమో గానీ, కారణం లేకుండా సహాయం చేస్తామని ఎవరు వచినా వాళ్ళు క్రిస్టియన్లే.
......................................................................................................................................................................
మా సమస్య నివేదించుకున్నం మా కొత్త మిత్రుడితో. రెండు మూడు ప్రశ్నలు వేసాడు. మా బతుకుల దరిద్రం గ్రహించాడు. కులం లేని వాళ్ళం. దైవం ఎంత దగ్గరిగా ఉన్నడో మాకు తెలియదు ఆ నిమిషాన.
రాయపురం girls high school లో try చేసారా? అన్నాడు.
"That is very good place for you."
సంతోషం గా మేము వెళ్తూఉంటే
"God bless you"అన్నడు.
ఆ school కి వెళ్ళి, ప్రిన్సిపాల్ ని చూస్తానన్నాను. మేడ మీద ఒక పెద్ద గది లోకి తీసుకెళ్ళారు ప్రశ్న లేకుండా. అక్కడ ఒక ముసలి ఇంగ్లీషు ఆమె ఆఫీసు బల్ల మీద కూచుని రాసుకుంటుంది. కళ్ళెత్తి మావంక ప్రశ్నార్ధకంగా చూసింది.
"ఏమెని చేర్చుకుంటారా?" అని అడిగాను." of course" అంది. రిజిస్టర్లు, కాగితాలు పక్కన పెట్టాను. ఈ లోపల కాగితాలు తిరగేస్తూ వొయ్యిని పిలిచి పక్కన కూచో బెట్టుకుంది. మళ్ళీ రాసుకుంటొంది. ఒక రెండు నిమిషాల తర్వాత, తల ఎత్తి నాతో."all right you can go" అంది. నాకేమీ అర్ధం కాలేదు. మర్నాడు మళ్ళీ వెళ్ళాను. వొయ్యి బట్టల పెట్టె తీసుకుని. ఆమె నన్ను చూడగానే కూచోమంది. వొయ్యి గంతులేస్తూ వచ్చింది."ఇక్కడ చాలా బావుంది. భోజనమే ఇబ్బంది. కానీ నేను ఇబ్బంది పడ దల్చుకోలేదు. నాకు నువ్వు నెల కి 17 రూ. పంపితే చాలు. "నేనింకా దిగ్భ్రమ నుండి బయటికి రాలేదు. "వీళ్ళు ఒక వేళ christian మతం లో చేరమంటె చేరనా? ఇక్కడ అందరూ క్రిస్తియన్లే" అంది."నే వెనుక నేనూ అవుతాను. హిందూ పీడ వదిలిపొతుంది "హిందూschool ళ్ళలో, govt. school ళ్ళ్లో వాళ్ళ చూపులూ, వాళ్ళ గర్వాలూ, వాళ్ళ ప్రశ్నలూ జ్ఞాపకం వచ్చాయి.
ఆ రాత్రి నేను సంతోషంగా రైలెక్కి నా యుధ్ధభూమికి; అంటే నేను పని చేస్తున్న స్కూల్ కి 60 మైళ్ళ వేగంతో తిరిగి వెళ్తున్నాను. అంతం లేని చీకట్లో, ఈ తెల్లని చార గంభీరంగా, ద్రుఢంగా, నిర్భయంగా, ఏ సందేహాలూ లేకుండా ముందుకు పరిగెత్తుకు పోతూంది. నా జీవితం అట్లా సాగిసాగిపోకూడదా? నా పక్కనే ఒక 20 మంది కూచుని ఉన్నారు. వాళ్ళ మొహాలకేసి చూస్తూ అనుకున్నాను. "మీరంతా నిర్విచారంగా, నిర్భయంగా కూచుని ఉన్నారు. ఎంత త్రుప్తి, సంతోషమో మీ మొహాల్లో. ఈ చీకట్లో ఇంత వేగంగా పరిగెత్తే ఈ యంత్రం మీద మీకంత విశ్వాసం, మిమ్మల్ని సురక్షితంగా ఇల్లు చేరుస్తుందని. అట్లానే మీ జీవితాల మీద గూడా అట్లాంటి విశ్వాసం ఉండివుంటుంది. తెలిసో, తెలీకో ఈశ్వరుదు, మిమ్మల్ని ప్రేమించే ఈశ్వరుడు సురక్షితంగా తీసుకుపోతున్నాడని.నిజంగా చెప్పండి, ఉన్నాడా? మీకు తెలుసునా? నా సందేహాలు మీకు లేవా? ఈ నిర్భాగ్యుడికి మీరు ఏ విధమైన త్రుప్తినివ్వలేరా? ఆ మధ్యాహ్నం మాకు సాయపడ్డ క్రిస్టియన్ ఆయన జ్ఞాపకం వచ్చాడు. మేము ఎటువంటి వాళ్ళమో తెలిసి కూడ "God bless you" అన్నాడు. నిజంగా ఒక God blessచేస్తాడా?
********************************************************************************
అక్కడ students, teachers అందరూ క్రిస్టియన్లు, తను తప్ప. కానీ తనను వేరుగా చూడలేదు. క్రిస్టియన్ మతం లో చేరమని తనని అడగలేదు. అందరూ ఎంత మంచివాళ్ళో.

1 comment:
nice anna ......
Post a Comment